Peddapalli: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:18 AM
సుల్తానాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ క్రీడాకారులు క్రికెట్‌పోటీల్లో రాష్ట్రస్థాయిలో రాణించాలని జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ ఆకాంక్షిం చారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ క్రీడాకారులు క్రికెట్‌పోటీల్లో రాష్ట్రస్థాయిలో రాణించాలని జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ ఆకాంక్షిం చారు. సుల్తానాబాద్ ప్రభుత్వజూనియర్‌కళాశాలలో నిర్వహి స్తున్న సుల్తానాబాద్ సూపర్‌లీగ్ క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ క్రికెట్ పోటీలను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మున్సి పల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ మాట్లాడుతూ మాజీఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ద్వారా ఈప్రాంతంలో విద్యార్థి, యువత క్రీడాస్పూర్తిని పొందారని అన్నారు. జాతీయస్థాయి క్రీడాకా రుడు కౌన్సిలర్ గాజులరాజమల్లు మాట్లాడుతూ సుల్తానాబాద్ నుంచి ఎందరో క్రీడాకారులు రాష్ట్రజాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలుక్రీడాపోటీలలో రాణించారని అన్నా రు. జిల్లాస్థాయి క్రీడాపోటీలలో ఎనిమిది జట్లు ఉన్నాయని, వీటిలో ఒక్కొక్క జట్టును వేలం ద్వారా ఎన్నుకోబడి పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు సూరశ్యామ్ వివరించారు. ఈసందర్భంగా జూపల్లి సందీప్‌ను నాయకులు ఘనంగా సన్మానించారు. క్రీడాపోటీలను నిర్వహిస్తున్న అర్గనైజర్ దేశెట్టి సందీ ప్, క్రాంతి, అనిల్, సిద్ద తిరుపతి తదితరులను వక్తలు అభినందించారు. కార్యక్రమంలో అల్లాడి వెంగళరావు, మున్సిపల్‌కమిషనర్ రమేష్, వైస్‌చైర్ పర్సన్ అంతటి పుష్పలత, డీసీఎంఎస్ మాజీడైరక్టర్ కల్లెపల్లి జానీ, తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వవిప్ విజయ రమణారావు ఉదయం పోటీలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించి నిర్వాహకులను అభినందించి వెళ్లారు.