Share News

Peddapalli: 3నాటికి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:21 AM

పెద్దపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఓటరు నమోదు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా జులై 3వ తేదీలోపు అర్హతగల ప్రతి ఓటర్‌కి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీని

Peddapalli:   3నాటికి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఓటరు నమోదు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా జులై 3వ తేదీలోపు అర్హతగల ప్రతి ఓటర్‌కి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీని పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శని వారం పెద్దపల్లి పట్టణంలోని 4వ వార్డు ప్రగతి నగర్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ఓటరు నమోదు ఆన్‌లైన్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రి యపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ప్రతి ఓటర్‌కి ఎన్యూమరేషన్‌ ఫారం అందేలా ప్రత్యేకచర్యలు చేపట్టాలని సూచిం చారు. జులై3 నాటికి ఫారాల పంపిణీ ప్రక్రియను పూర్తి స్థాయిలో ముగించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాం తాల్లో బీఎల్‌వోలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్‌కలెక్టర్లు, వార్డు అధికారులు పూర్తిసహకారం అందిస్తూ ఫారాల పంపిణీని వేగ వంతం చేయాలని తెలిపారు. ప్రతి ఓటరుకి రెండు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించాలని, ఒక ఫారాన్ని ఓటరు వివరాలతో నింపించి స్వీకరించగా, మరో ఫారంపై స్వీకరణ ధ్రువీకరణ చేసి రసీదుగా ఓటరుకి తిరిగి అందజేయాలని సూచించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిం చాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి చేరుకొని ప్రతి అర్హత ఓటరుకి ఎన్యూమరేషన్‌ ఫారం అందించేలా అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ పరిశీ లనలో పెద్దపల్లి తహసీల్దార్‌ రాజయ్య, మున్సిపల్‌కమిషనర్‌ వెంకటేష్‌, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి

ప్రాధాన్యమివ్వాలి

పెద్దపల్లి కల్చరల్‌ : విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైనవిద్యకు ఉపాధ్యాయులు అధికప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యసన ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో రావడం అభినంద నీయమన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థుల విద్యా ప్రమా ణాలను మరింత మెరుగుపర్చాలన్నారు. ప్రతిపాఠ శాలలో వార్షిక విద్యాప్రణాళిక, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠ్యప్రణాళికలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి రెమెడియల్‌ బోధన అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అకాడమిక్‌ ప్యానల్‌ తనిఖీ బృందసభ్యులను కలెక్టర్‌ పరిచయం చేయగా, పాల్గొన్న ఉపాధ్యాయులకు అకాడమిక్‌ ప్లానింగ్‌ మెటీరియల్‌ను అందించారు. సమావేశానికి జిల్లాలోని 14మండలాల నుంచి వెయ్యిమంది ఉన్నతపాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్‌, జిల్లావిద్యాశాఖ ఎంవో షేక్‌, సెక్టోరల్‌ అధికారులు మల్లేష్‌, జీసీడీవో కవిత, అలోకిట్‌, ఆర్పీ సమీర్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:21 AM