Peddapalli: విద్యారంగంలో ధర్మారం మండలానికి ప్రత్యేక స్థానం
ABN , Publish Date - May 23 , 2026 | 12:44 AM
ధర్మారం, మే 22 (ఆంధ్ర జ్యోతి): విద్యారంగంలో పెద్దపల్లి జిల్లాలోనే ధర్మారం మండలానికి ప్రత్యేకస్థానం ఉందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధి కారి పీఎం షేక్ అన్నారు.
జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్
ధర్మారం, మే 22 (ఆంధ్ర జ్యోతి): విద్యారంగంలో పెద్దపల్లి జిల్లాలోనే ధర్మారం మండలానికి ప్రత్యేకస్థానం ఉందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధి కారి పీఎం షేక్ అన్నారు. శుక్ర వారం మండలంలోని బొమ్మరెడ్డి పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘విద్యార్థి ప్రతిభ పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవం’ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ధర్మారం మండలం ఇంటర్మీడియట్‌లో జిల్లాలో ప్రథమస్థానం సాధిం చడం, ప్రాథమికస్థాయి తొలిమెట్టు కార్యక్రమంలో జిల్లాస్థాయిలో సింహభాగం చాంపియన్లు ధర్మారం మండలానికే రావడం గర్వకారణమన్నారు. ఎఫ్‌ఎల్‌ఎ న్‌లో జిల్లా చాంపియన్ సాధించిన ప్రాథమిక పాఠ శాల ఉపాధ్యాయులతో పాటు పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాలను మోడ ల్‌స్కూల్, కేజీవీబీప్రిన్సిపాల్స్‌ను సన్మానించారు. వీరితో పాటు జిల్లా, మండలస్థాయిల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, మెమెంటో, ప్రశంసా పత్రా లు, నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమ నిర్వాహనకు సహాయసహకారాలుఅందించిన కొలుము దామోదర్‌ఫౌండేషన్‌ను ఎంఈవో పి ప్రభాకర్ అభినం దించారు. జిల్లారిసోర్స్‌పర్సన్స్ కిరణ్,కృష్ణారెడ్డి, అల్లోకిత్ టీంలీడర్ సమీద్‌అహ్మద్, లీడ్‌ఇండియా స్టేట్‌ట్రైనింగ్ మేనేజర్ తాడూరి శ్రీనివాసచారి, కాంప్లెక్స్‌ప్రధానోపా ధ్యాయులు షీలా, వెంకటేశ్వర్లు, సరిత,ఫౌండేషన్ గౌర వఅధ్యక్షులు కొలుముల పెద్దగంగన్న, మల్లవ్వ, వేల్పు లనాగరాజు, వాఖ్యాత జాడిశ్రీనివాస్, ఉన్నతపాఠశా లల ప్రధానోపాధ్యా యులుసత్యం,వసంత, సమ్మయ్య, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న, మోతిలాల్ నాయక్, సీఆర్పీలు పాల్గొన్నారు.