Share News

Peddapalli: పుష్కరఘాట్లను పరిశీలించిన డీసీపీ

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:47 AM

యైుటింక్లయిన్‌కాలనీ, మార్చి 4 (ఆంధ్ర జ్యోతి): పెద్దపల్లి డీసీపీ బూక్య రాంరెడ్డి బుధ వారం సుందిల్ల పుష్కరఘాట్‌ను పరిశీలించారు.

 Peddapalli:   పుష్కరఘాట్లను పరిశీలించిన డీసీపీ

యైుటింక్లయిన్‌కాలనీ, మార్చి 4 (ఆంధ్ర జ్యోతి): పెద్దపల్లి డీసీపీ బూక్య రాంరెడ్డి బుధ వారం సుందిల్ల పుష్కరఘాట్‌ను పరిశీలించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్ల కోసం నదీ పరిసరాలు, ఘాట్‌లను పరిశీలించారు. ట్రాఫిక్‌ మళ్ళింపు, వాహనాల పార్కింగ్‌, సీసీ కెమెరాల ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లపై ఏసీపీ రమేష్‌, సీఐ ప్రసాదరావులతో చర్చించారు. భక్తులు ప్రశాంతంగా పవిత్ర స్నానాలు ఆచరించి, ఇబ్బందులు లేకుండా తిరిగి వెళ్ళేలా ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

మంథని: మంథని గోదావరినది తీరంలోని పుష్కరఘాట్‌ను పెద్దపల్లిడీసీపీ భూక్య రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ బుధవారం పరిశీలించారు. వచ్చేఏడాది జరిగే గోదావరినది పుష్కరాల నేపథ్యంలో ఘాట్‌వద్ద భక్తల రాక పోకలు, సీసీకెమెరాల పనితీరు, పార్కింగ్‌ ఏర్పా ట్లు, ట్రాఫిక్‌ మళ్లింపులాంటి అంశాలపై పోలీసు అధికారులతో చర్చించారు.భక్తులు సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో ఘాట్లను వినియోగిం చుకునేలా అన్నిశాఖల అధికారుల సమన్వయం తో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని డీసీపీ సూచించారు. వారివెంట మంథని, గోదా వరిఖని టూటౌన్‌ సీఐలు బీ.రాజు, ప్రసాద్‌రావు, ఎస్‌ఐ డేగ రమేష్‌ ఉన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:47 AM