Peddapalli: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:52 AM
కోల్‌సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఈనెల11న జరిగే కార్పొరేషన్ ఎన్ని కలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పెద్దపల్లి డీసీపీ బూక్య రాంరెడ్డి నాయక్ సూచించారు.
ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించుకోవాలి...
కోల్‌సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఈనెల11న జరిగే కార్పొరేషన్ ఎన్ని కలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పెద్దపల్లి డీసీపీ బూక్య రాంరెడ్డి నాయక్ సూచించారు. శనివారం రాత్రి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్‌నగర్, 7ఎల్‌ఈపీ, రమేష్‌నగర్ ఏరియాల్లోని సమస్యా త్మక పోలింగ్‌కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలుజరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు, పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారు నిబంధనలు పాటిస్తూ సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.