Share News

Peddapalli: అక్రమ దందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దాసరి మనోహర్‌ రెడ్డి

ABN , Publish Date - May 23 , 2026 | 12:42 AM

పెద్దపల్లి టౌన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజక వర్గంలో అక్రమ దందాలకు కేరఫ్‌ అడ్రస్‌ మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అని పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు.

 Peddapalli: అక్రమ దందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దాసరి మనోహర్‌ రెడ్డి

బేషరుతుగా క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్‌ నాయకులు

పెద్దపల్లి టౌన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజక వర్గంలో అక్రమ దందాలకు కేరఫ్‌ అడ్రస్‌ మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అని పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆర్కేగార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. అబద్ధాలు, అవాస్తవాలతో గురువారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. ఉచితంగా ఇచ్చే చెరువుమట్టిని ఇటు బట్టీలకు అమ్ముకున్నది, మోరం మట్టిని మట్టి వ్యాపారులతో కుమ్మక్కై మట్టిదందా వ్యాపారం చేసింది దాసరి మనోహర్‌రెడి కాదా అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడ్డ మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రజానాయకుడు విజయరమణారావుపై అసత్యపు ఆరోపణలు, దూషణలు చేయడం సిగ్గు చేటన్నారు. రైతులను పట్టుకొని బూతూలు అంటావా. నీకు రైతులంటే అంతా చులకనా అని.. రైతులకు బేషేరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆగగడుగునా రైతులు నిన్న అడ్డుకుంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, బిరుదు కృష్ణ, వ్యవసాయమార్కెట్‌ చైర్మన్లు కూర మల్లారెడ్డి, మినుపాల ప్రకాష్‌ రావు, మాజీఎంపీపీ గొపగాని సారయ్య గౌడ్‌, పట్టణ అధ్యక్షులు భూషణవేణి సురేష్‌ గౌడ్‌,కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దిష్టిబొమ్మను శుక్రవారం విజ్జన్న టీం ఆధ్వర్యంలో కమాన్‌ చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్డా అని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేదంంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Updated Date - May 23 , 2026 | 12:42 AM