Share News

Peddapalli: కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి అవసరం

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:23 AM

లిగేడు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేపట్టాలని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

Peddapalli:   కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి అవసరం

- ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు

ఎలిగేడు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేపట్టాలని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధ వారం మండలంలోని శివపల్లి గ్రామంలో ఎమ్మె ల్యే వ్యవసాయక్షేత్రంలోని మూడుఎకరాల్లో ఆయి ల్‌పామ్‌ మొక్కలను నాటే కార్యక్రమానికి కలెక్టర్‌ కోయశ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటల మార్పిడి గురించి రైతులకు సూచించడమే కాకుండా తాను కూడా స్వయంగా ఆయిల్‌పామ్‌ మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కలె క్టర్‌ కోయశ్రీహర్ష మాట్లాడుతూ ఒంటరి మహి ళలకు పూర్తిసబ్సిడీతో ఆయిల్‌పామ్‌ మొక్కలను అందజేస్తామన్నారు. వాటితో వారు ఆర్థిక స్వావ లంభన దిశగా పయణించాలని కోరారు. కార్యక్ర మంలో గ్రామసర్పంచ్‌ దుగ్యాల వాణి గోపాల్‌ రావు, జిల్లా గ్రంథాలయచైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, మల్లారెడ్డి, పోచాలు, జిల్లా ఉద్యావన అధికారి గడ్డం శ్యాంప్రసాద్‌, తిరుమల ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ కేశుకల్యాంకర్‌, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:23 AM