Share News

Peddapalli: గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:33 AM

కోల్‌సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జ నాన్ని ప్రశాంతంగా నిర్వహించు కోవాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా సూచించారు.

 Peddapalli:  గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన  సీపీ

కోల్‌సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జ నాన్ని ప్రశాంతంగా నిర్వహించు కోవాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా సూచించారు. రామగుండం పోలీస్‌ కమిషన రేట్‌ పరిధిలోని గోదావరిఖని గోదావరి వంతెనపై నిమజ్జన ఏర్పాట్లను పోలీస్‌ అధికారులతో కలిసి సీపీ పరిశీలించారు. పోలీ స్‌సిబ్బంది, బందోబస్తు ఏర్పాట్లు, మంచినీటి వసతి, గజఈతగాళ్ల ఏర్పాటు, విద్యుత్‌దీపాల సౌకర్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌, రామకృ ష్ణాపూర్‌, జైపూర్‌ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య లో విగ్రహాలు నిమజ్జనానికి రానున్నందున ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకల మార్గాలు, అవసరమైన చోట్ల చేపట్టాల్సిన ట్రాఫిక్‌ మళ్లింపు ప్రాంతా లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనానికి సంబంధించిన అన్నీ శాఖల అధికారులతో సమన్వయం చేసు కుంటూ ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టి నిమజ్జన కార్యక్రమాన్ని, సురక్షితంగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లుతో పాటు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:33 AM