Peddapalli: కౌన్సిలర్లు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలి
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:34 AM
సుల్తానాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం నేపథ్యంలో మున్సి పాలిటీలో చేపట్టే పారిశుధ్యపనులను కౌన్సిలర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమణారావు అన్నారు.
- ప్రభుత్వ విప్ విజయరమణారావు
సుల్తానాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం నేపథ్యంలో మున్సి పాలిటీలో చేపట్టే పారిశుధ్యపనులను కౌన్సిలర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాల గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయావార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజలు వెంటవెంటనే వార్డు కౌన్సిలర్ల దృష్టికి తేవాలన్నారు. కౌన్సిలర్లు ఈ వర్షాకాలంలో వందరోజుల ప్రత్యేక కార్యక్రమం తీసుకుని ప్రతీరోజు లేదా డే బైడే గాని వార్డుల సందర్శన చేయాలన్నారు. నెలలో ఐదురోజులు తాను కూడా ఈ కార్యక్రమానికి సమయం వెచ్చిస్తూ మీతో పాల్గొంటానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ మాట్లాడుతూ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, తహసీల్దార్ బషీరొద్దిన్, డాక్టర్ ఉదయ్‌కుమార్, కౌన్సిలర్లు వేగోళం పద్మ అబ్బయ్య గౌడ్, గాదాసు మంజుల రవిందర్, సిద్ద తిరుపతి, గాజుల రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి టౌన్ : పట్టణపారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు పాలకవర్గానికి సూచించారు. మున్సిపల్ కార్యాల యంలో మున్సిపల్‌చైర్మన్, వైస్‌చైర్మన్.పట్టణ కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు అందుబాటులోఉంటూ పారిశుధ్యంపై దృష్టిసారించాలని, పట్టణ కౌన్సిలర్లు నిత్యంప్రజలమధ్య ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.
పెద్దపల్లి ట్టణంలోని శాంతినగర్‌లో బుధవారం ప్రభుత్వవిప్ చింతకుంట విజయ రమణారావు రిక్వెస్ట్ బస్‌స్టాప్‌ను ప్రారంభించారు. కార్యక్ర మంలో మున్సిపల్‌చైర్మన్ నూగిల్లమల్లయ్య, కమిషనర్ ఆకులవెంకటేష్, వార్డు కౌన్సి లర్లు పురెల్ల శైలజసుధాకర్, పస్తాంలక్మిజంపయ్య,కాలనీవాసులు, పాల్గొన్నారు.