Peddapalli: రామగుండంలో త్వరలో నిరంతర నీటి సరఫరా
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:31 AM
కోల్‌సిటీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో త్వరలో 24గంటల మంచి నీటి సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు.
డివిజన్ బాటలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
కోల్‌సిటీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో త్వరలో 24గంటల మంచి నీటి సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా బుధవారం మేయర్ మహం కాళి స్వామితో కలిసి 59వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్, గాంధీనగర్, మార్కండే యకాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. మంచినీటి పైప్‌లైన్లు, డ్రైన్లను పరిశీలించారు. నిరంతరం నీటి సరఫరాకు ప్రణాళికలు చేశామని, త్వర లోనే అమలులోకి తీసుకువస్తామన్నారు. డ్రైనే జీల వద్ద మంచినీటి పైప్‌లైన్ల లీకేజీని అరిక ట్టాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ప్రజలు, వ్యాపార సంస్థల భాగ స్వామ్యం తప్పనిసరి అన్నారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ కాలువల్లో పూడికతీత ఒక మహాయజ్ఞంలా సాగుతుందని, కాలువల్లో చెత్తవేసే వారికి ఫోటోలు తీసి జరి మానాలు విధిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్ పాతపెల్లిఎల్లయ్య, స్థానికకార్పొ రేటర్ బాలసాని తిరుపతి, కార్పొరేటర్లు దూళి కట్ట సతీష్, వడ్లూరి రవి, సాంబమూర్తి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.