Peddapalli: కాల్వశ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:08 AM
కాల్వశ్రీరాంపూర్, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి): కలెక్టర్ కోయశ్రీహర్ష గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించారు.
కాల్వశ్రీరాంపూర్, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి): కలెక్టర్ కోయశ్రీహర్ష గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పాఠశా లలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పల్లెదవాఖాన, వ్యవసాయగోడౌన్, నిర్మాణంలోని తహసీల్దార్ కార్యాలయ పనులను, డీసీఎంఎస్, శ్రీరాంపూర్ ఫ్యాక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా కలె క్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మంజూరు చేసిన ప్రహరీలు, పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో అసం పూర్తిగా ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయం భవనం ఈనెల 26నాటికి ప్రారం భించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని గోదాములను తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు. ఆయనవెంట తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, ఎంపీడీవో రాంమోహన్, మండల విద్యాధికారి మహేష్, మండల పంచాయతీ అధికారి ఆరీఫ్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పవన్, వ్యవసాయ అధికారి నాగార్జున, అధికారులు తదితరులు పాల్గొన్నారు.