Peddapalli: కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:49 AM
పెద్దపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు నిర్మాణపనులు వేగంగా పూర్తి చేసేం దుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వేఓవర్ బ్రిడ్జి పనులు వేగ వంతం చేయాలని అన్నారు. అండర్‌పాస్ పనులు నెలరోజుల లోపు పూర్తి చేయాలని, ఆర్‌వోబీ పూర్తయ్యే లోపు అప్రోచ్ రోడ్డును కూడా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని రైల్వేశాఖ అధికారు లను, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈబావ్‌సింగ్, పెద్దపల్లిఆర్డీవో గంగయ్య, అధికారులు పాల్గొన్నారు.