Peddapalli: బాలల హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:35 AM
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ నివారణ, బాలల అక్రమరవాణా అరికట్టేందుకు ప్రభుత్వశాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ నివారణ, బాలల అక్రమరవాణా అరికట్టేందుకు ప్రభుత్వశాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బాలల హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష అవగాహన పోస్టర్‌ను సాధన సంస్థ డైరెక్టర్ ఆలూరి కామేశ్వరితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ బాలల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమరవాణా వంటి సమస్యలను అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బాలల హక్కులకు సంబంధిం చిన అంశాలపై ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. జస్ట్‌రైట్స్ ఫర్ చిల్డ్రన్, సాధన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాధన సంస్థ డైరెక్టర్ ఆలూరి కామేశ్వరి తెలిపారు. కార్యక్రమం లో సాధన సంస్థ డైరెక్టర్ ఆలూరి కామేశ్వరి, సంబంధిత అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
నీటి సమర్థ వినియోగంతో
అధిక దిగుబడులు..
పెద్దపల్లి : వరిసాగులో ఆధు నిక పద్ధతులను అవలంబిస్తూ నీటిని సమర్థవంతంగా వినియో గించి అధిక దిగుబడులు సాధిం చాలని కలెక్టర్ కోయశ్రీహర్ష రైతులకు సూచించారు. రంగంపల్లి లోని వెంకటపద్మ ఫంక్షన్ హాల్‌లో ఓసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ’వరి వరహాలు‘ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. నీటిపొదుపు పద్ధతులు పాటించిన రైతులకు ఎకరాకు 5వందల రూపాయల చొప్పున ప్రోత్సాహక చెక్కులు అందజేశారు. వరిసాగులో అవసరమైన సమయంలోనే నీటిని అందించడం ద్వారా నీటివృథాను తగ్గించడంతోపాటు దిగుబడులను పెంచవ చ్చన్నారు. ఏడబ్ల్యూడీ వంటి ఆధునికపద్ధతులను రైతులు అవలంభించాలని జిల్లావ్యవసాయఅధికారి శ్రీనివాస్ అన్నారు. బయోచార్, బయోగ్యాస్, ఆగ్రోఫారెస్ట్రీ ప్రాజె క్టుల ఏర్పాటుకుసహకరిస్తామని తెలిపారు. కార్యక్రమం లో ఎన్‌మురళీధర్, డైరెక్టర్ దివ్యారెడ్డి, వ్యవసా యశాఖ అధికారులు, సంస్థప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.