Peddapalli: జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:24 AM
రామగిరి, ఫిబ్రవరి 6 (ఆంరఽధజ్యోతి): జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్లు హరిపచౌరి, గోవర్ధన్ అన్నారు.
- కమిషనర్లు హరిపచౌరి, గోవర్ధన్
రామగిరి, ఫిబ్రవరి 6 (ఆంరఽధజ్యోతి): జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్లు హరిపచౌరి, గోవర్ధన్ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో సంబంధిత అధికారులు, ఉద్యోగు లతో ప్రయాస్ ఆరవషెడ్యూల్‌లో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాగితరహితసేవలు అందిం చడమే లక్ష్యంగా లావాదేవీలు సి-కేర్స్‌పోర్టల్ ద్వారా మాత్ర మే జరుతున్నాయన్నారు. మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా సీఎంపీఎఫ్ పొంద వచ్చునన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్, రివైజ్డ్‌పెన్షన్ తదితర అంశాలపై చర్చించారు. తొలుత కమిషనర్లుకు ఎన్‌సీడబ్ల్యూ ఉద్యోగుల రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ 69పీపీవో ఆర్డర్స్‌ను ఆర్జీ-3 జీఎం మధుసూదన్ అందజేశారు. సమావేశంలో గుర్తింపు, ప్రాతినిధ్యసంఘాల నాయ కులు రామచంద్రారెడ్డి, రామారావు, అధికారులు కోల శ్రీనివాస్, రామ్మోహన్, బండిసత్యనారాయణ, సురేఖ, రాజేంద్రకుమార్, సుదర్శనం, అనిత, సునీల్ ప్రసాద్, మనోహర్, ప్రదీప్‌రెడ్డి, కుమార స్వామి, వివిధగనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.