Share News

Peddapalli: ఆకలి రాష్ట్రంగా మారుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:11 AM

మంథని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నపూర్ణగా ఉన్న తెలం గాణ రాష్ట్రాన్ని ఆకలిరాష్ట్రంగా మారుస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మాజీఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు.

 Peddapalli: ఆకలి రాష్ట్రంగా మారుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

మంథని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నపూర్ణగా ఉన్న తెలం గాణ రాష్ట్రాన్ని ఆకలిరాష్ట్రంగా మారుస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మాజీఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆదివారం పుట్ట మధు విలేకరులతో మాట్లా డుతూ.. రైతులు వేసే ఏ సన్నరకం వరి పంటలైనా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే నని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌పార్టీ అంటేనే అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి, చీకటి బతు కులే అన్నారు. పంటల సాగు, కొనుగోలు, బోనస్‌ అమలుపై మంత్రుల మాటలతో రైతులు అయోమ యానికి గురవుతున్నారన్నారు. సీఎం, మంత్రులు దేవుళ్ల మీద ఒట్టు వేసి నిజాలు చెప్పకపోవడంతో ప్రకృతి సైతం వారికి సహకరించడం లేదన్నారు. పంటల మార్పు పేరుతో సీఎం రైతుల జీవితాలను ఆగమం చేస్తున్నారన్నారు. మంథనికి చెందిన మైనార్టీ నేత ఖలీల్‌ఖాన్‌ పుట్ట మధు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు మిర్యాల ప్రసాద్‌రావు, ఏగోళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌, కనవేన శ్రీనివాస్‌, గొబ్బూరి వంశీ పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:11 AM