Share News

Peddapalli: విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మెకు సీఐటీయూ మద్దతు

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:09 AM

పెద్దపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది.

Peddapalli: విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మెకు సీఐటీయూ మద్దతు

పెద్దపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్జిజన్‌ కార్మికులు సమ్మె చేపట్టారు. మండలంలోని రాఘవపూర్‌లో గల పెద్దపల్లి సర్కిల్‌ కార్యాలయం ముందు జరుగుతున్న సమ్మెలో సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి జి జ్యోతి, సీపెల్లి రవీందర్‌ శుక్రవారం హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్‌ కార్మికుల పట్ల ప్రభుత్వం, విద్యుత్‌సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. వరంగల్‌ ఎన్పీడీసీఎల్‌ ముందు వేలాది మందితో మహాధర్నా చేసినా స్పందించకపోవడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమన్నారు. ఒకే సంస్థలో రెండు రకాల సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తూ వివక్ష చూపడం దారుణమన్నారు. అర్హత కలిగిన కార్మి కులకు వెంటనే కన్వర్షన్‌ ఇవ్వాలని, అన్‌మ్యాన్‌ కార్మి కులను ఆర్టిజన్లుగా గుర్తించా లని డిమాండ్‌ చేశారు. జీవో11 ప్రకారం పీస్‌ రేట్‌, స్పాట్‌ బిల్లింగ్‌ కార్మికులకు కనీసవేతనాలు అమ లు చేయాలన్నారు. కార్మికుల న్యాయ మైన కోర్కెలు తీర్చేవరకు సీఐటీయూ అండ గా ఉంటుందని, అవసరమైతే ఈ పోరా టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్‌ మల్ల కిషన్‌రెడ్డి, ఇరుగురాల రమేష్‌, ఎల్లయ్య, నర్సయ్య, నరేష్‌, కొండయ్య, జడలు సత్యనారాయణ, కాళీం, మాంకాళి రాజు, చిన్నయ్య, రమేష్‌, జగన్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:09 AM