Peddapalli: బీఆర్‌ఎస్ అగ్రనాయకులపై ముఖ్యమంత్రి టార్గెట్
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:43 AM
ధర్మారం, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి): బీఆర్‌ఎస్ అగ్రనాయకులైన కేసీ ఆర్, కేటీఆర్, హరీష్‌రావును ముఖ్య మంత్రి టార్గెట్‌చేసి అబద్దాలు మాట్లాడు తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
-ధర్మారంలోని పలు వినాయక మండపాల్లో కొప్పుల పూజలు
ధర్మారం, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి): బీఆర్‌ఎస్ అగ్రనాయకులైన కేసీ ఆర్, కేటీఆర్, హరీష్‌రావును ముఖ్య మంత్రి టార్గెట్‌చేసి అబద్దాలు మాట్లాడు తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం మండ లకేంద్రంలోని పలు వినాయకమండపా లను దర్శించిన ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తికి భూఆక్రమణచేసే అవసరం ఏముంటుం దని ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫాంహౌల్‌లో 388ఎకరాల ప్రభుత్వభూమి ఉందని నిండు అంసెబ్లీలో రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్పారన్నారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూమి ఒకఇంచు కూడా లేదన్నారు. మీసర్వేలో ప్రభుత్వభూమి ఉందని తేలకుంటే ముఖ్యమంత్రి ముక్కుభూమికి రాస్తావా అంటూ ప్రశ్నించారు. కేసీ ఆర్ కుటుంబం పుట్టడమే భూస్వాముల కుటుంబంలో పుట్టారని, 150రూపాయలతో ఎర్రబస్సు ఎక్కివచ్చాననే ముఖ్యమంత్రి, ఇన్ని వేలకోట్లుఎలా సంపాందించగలి గారో చెప్పాలని అన్నారు. 30శాతంకమీషన్లతో ప్రభు త్వం పనిచేస్తుందనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి సంపాదన చూస్తుం టే అదినిజమే అనిపిస్తుందని తెలిపారు. కార్యక్రమం లో బీఆర్‌ఎస్‌నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, తుమ్మల రాంబాబు, ఆవుల శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్, గాజులరాజు, సల్వాజీ మాధవరావు, నాడెంశ్రీనివాస్, రాగులమల్లేశం, కూరపాటి శ్రీనివాస్, ఐతె వెంకట స్వామి, నార ప్రేమ్‌సాగర్, అమరపెల్లి రాజేశం, ఎండీ ఆజామ్, తోడేటి మురళి, ఆవుల లత పాల్గొన్నారు.