Share News

Peddapalli: ' అర్హులందరికీ చేయూత పింఛన్లు

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:15 AM

కోల్‌సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం నగర మేయర్‌ మహంకాళిస్వామి అన్నారు.

Peddapalli: ' అర్హులందరికీ చేయూత పింఛన్లు

కోల్‌సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం నగర మేయర్‌ మహంకాళిస్వామి అన్నారు. గురువారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాల యంలో అధికారులతో, సిబ్బందితో సమీక్షసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనర్హులకు పెన్షన్లు రాకుండా క్షేత్రస్థాయిలో సూక్ష్మంగా పరిశీలించాలన్నారు. అర్హులైన వారికి తప్పకుండా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్‌ అరుణశ్రీ, డీసీ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మట్టి గణపతులను పూజించాలి...

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని రామగుండం నగర మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందికి మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఓపీ విగ్రహాలైతే నెలల తరబడి కరగకుండా నదిలో పేరుకుపోయి కలుషితం చేస్తాయన్నారు. ప్రజలు మట్టి గణపతులను పూజించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్‌ అరుణశ్రీ, డీసీ వెంకటస్వామి, కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్ట్‌ కనకజ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:15 AM