Share News

Peddapalli: బస్‌ డిపోను త్వరలో ప్రారంభిస్తాం

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:22 AM

పెద్దపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్‌డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఐటీ, పరిశ్ర మలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వవిప్‌, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ఆదివారం పరిశీలిం చారు.

 Peddapalli:  బస్‌ డిపోను త్వరలో ప్రారంభిస్తాం

- రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

- పెద్దపల్లి బస్‌డిపో స్థలాన్ని పరిశీలించిన రాష్ట్రమంత్రులు, ప్రభుత్వవిప్‌

పెద్దపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్‌డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఐటీ, పరిశ్ర మలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వవిప్‌, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ఆదివారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌ విజయ రమణారావు, సీనియర్‌మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్‌డిపోను మంజూరు చేశారని తెలిపారు. బస్‌డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసిత్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలనే డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొను గోలు ప్రక్రియ కూడా కొన సాగుతోందని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేం దుకు ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమ స్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించు కోవాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదు గురు మంత్రులు, సీనియర్‌ అధికారులు,40మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మికసంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించ నున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్య త్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెంద వద్దని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మున్సిపల్‌చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 01:22 AM