Peddapalli: బీఆర్‌ఎస్, బీజేపీలను తరిమికొట్టాలి..
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:29 AM
పెద్దపల్లి, ఫిబ్రవరి 6 (ఆంరఽధజ్యోతి): పెద్దపల్లి మున్సి పాలిటీపై కాంగ్రెస్‌పార్టీజెండా ఎగరేస్తామని, పట్టణ అభివృద్ధి కోసం కోట్లరూపాయలు వెచ్చిస్తున్నామని, ఓట్ల కోసం వస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీలను తరిమి కొట్టి కాంగ్రె స్‌పార్టీ అభ్యర్థులను అఖండమెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పిలు పునిచ్చారు.
- పెద్దపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం..
- కార్నర్‌మీటింగ్‌లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
- బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరిక
పెద్దపల్లి, ఫిబ్రవరి 6 (ఆంరఽధజ్యోతి): పెద్దపల్లి మున్సి పాలిటీపై కాంగ్రెస్‌పార్టీజెండా ఎగరేస్తామని, పట్టణ అభివృద్ధి కోసం కోట్లరూపాయలు వెచ్చిస్తున్నామని, ఓట్ల కోసం వస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీలను తరిమి కొట్టి కాంగ్రె స్‌పార్టీ అభ్యర్థులను అఖండమెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పిలు పునిచ్చారు. శుక్రవారం ఆయనపట్టణంలోని ఐటీఐకళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థిం చారు. అనంతరం 1, 5, 13, 14, 15, 16, 17, 18,32,33,34,35,36వార్డుల్లో పార్టీఅభ్యర్థుల తరపున విస్తృతప్రచారం నిర్వహించారు. తెనుగువాడలో జరిగిన కార్నర్‌మీటింగులో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌పాల నలో పెద్దపల్లి పట్టణంఅభివృద్ధికి నోచుకోలేద న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకవచ్చామ న్నారు. పెద్దపల్లికి ఆర్టీసీ బస్‌డిపోతో పాటు బైపాస్‌రోడ్డు మంజూరు చేయిం చామన్నారు. ప్రధానరహదారులను అభివృద్ధి చేయ డంతోపాటు వీధుల్లో సిమెంట్‌రోడ్లు, మురికి కాలు వలు నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణపనులు జరుగుతున్నాయని, వాకర్స్‌నడిచేందు కు వీలుగా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణంలోని అనివాడలకు తాగునీటి సౌకర్యం కల్పించామ న్నారు. మహిళలకు ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణం, 200యూనిట్ల వరకు ఉచితవిద్యుత్, రైతు లకు 2లక్షల వరకు రుణమాఫీచేసి, 9రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమచేశామన్నారు. ఆరోగ్య శ్రీద్వారా 10లక్షలవరకు పెంచి ఉచితవైద్యాన్ని అందిస్తు న్నామని గుర్తుచేశారు. ఓట్ల సమయంలో వచ్చే బీఆర్‌ఎస్, బీజేపీలని ప్రజలుతరిమికొట్టాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్నిచూసి ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో అభ్యర్థులు బూతగడ్డ సంపత్, పూరెళ్ల శైలజ, గుజ్జుల కుమారస్వామి, పాగాల శ్రీకాంత్, మహమ్మద్ అస్లం పర్వేజ్, నెత్తెట్ల కొమురయ్య, నాంసాని శ్రీనివాస్, తోట ఫణిందర్, తిర్రి శ్రీలత, బూతగడ్డ స్వప్న, ఎండీ అష్రాఫ్ షరీఫ్, దేవనంది రమాదేవి, ముస్కాన్ నాజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ పార్టీకి షాక్..
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు మాజీకౌన్సిలర్ పెద్ది గీతాంజలి, వెంకటేష్‌తోపాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి ఎమ్మెల్యే విజయరమణారావు కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్ర మంలో పార్టీ నాయకులు గంట రమేష్, మాడూరి వినోద్, ఇల్లందుల రజని కృష్ణమూర్తి, ఆర్యవైశ్య సంఘంనాయకులు మంచాల వరప్రసాద్, నార్ల నాగభూషణం, కొమురవెల్లి జయప్రకాష్, వెలిశాల రాజు, గిరి, సతీష్ పాల్గొన్నారు.