Peddapalli: బీజేపీ రైతులకు పూర్తిగా వ్యతిరేకం
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:05 AM
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతలకు పూర్తిగా వ్యతిరేకమని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
- ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతలకు పూర్తిగా వ్యతిరేకమని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం మండ లంలోని కూనారం, వెన్నంపల్లి, జాఫర్‌కాన్‌పేట గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మక్కలు కొనడం లేదని, మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. రైతులను కేంద్రం విస్మ రించడం సిగ్గుచేటన్నారు. కానీ రైతుల సంక్షే మమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు మంతెన రాజయ్య, ఆకుల శ్రీనివాస్, కలవేన రమరమేష్, యాదగిరి జ్యోత్న్యశ్రీనివాస్, సీఈఓ విజయేందర్, ఏపీఎం లవ కుమార్, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌నాయకులు పాల్గొన్నారు.
ముందస్తుగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సుల్తానాబాద్ : గత సీజన్‌లో ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఈసారి ముందుగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వవిప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రేగడిమద్దికుంట గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఆయన బుధవారం రైతులు, సర్పంచులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఈసీజన్‌లో మొక్కజొన్న క్వింటాలుకు ధరను రాష్ట్ర ప్రభుత్వం రూ.2400గా నిర్ణయిం చిందన్నారు. జిల్లాలోమార్క్‌ఫెడ్‌ద్వారా, మార్కెట్ కమిటీలు, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో మార్కెట్‌చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు. విజయరమణారావుకు సర్పంచ్ కోదాటి సాయికిరణ్ తదితరులు ఎడ్లబండి నమూనాను బహుకరించి ఘనంగా సన్మానించారు. కాగా పలుచోట్ల మార్కె ట్‌చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు ధాన్యం కేంద్రాలను ప్రారంభించారు.
వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తే శాశ్వతంగా కొనుగోలు కేంద్రం
ఓదెల : వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే అధికారికంగా శాశ్వత మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలో విజయ రమణారావు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులకు మద్దతు ధర లభిస్తుందని అన్నారు. పంట మార్పిడి చేసి రైతులు అధిక లాభాలను పొందాలని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, సింగిల్ విండో మాజీచైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిట్టల రవికుమార్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, పాల్గొన్నారు.