Peddapalli: పారిశుధ్య కార్మికులకు బీజేపీ ఘన సత్కారం
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:31 AM
గోదావరిఖని, అక్టోబర్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవాసంకల్ప అభియాన్‌లో భాగంగా పారిశుధ్య కార్మికులను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు.
గోదావరిఖని, అక్టోబర్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవాసంకల్ప అభియాన్‌లో భాగంగా పారిశుధ్య కార్మికులను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. బీజేపీ లేబర్‌సెల్ పెద్దపల్లిజిల్లా కన్వీనర్ తడగొండ నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీశ్రేణులు పారిశుధ్య కార్మికుల కాళ్లుకడిగి సన్మానించారు. అనంతరం కార్మికులతోకలిసి సహపంక్తి భోజనం చేశారు. వారిసేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన తడగొండ నర్సయ్యను కందుల సంధ్యారాణి అభినందించారు. కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, ఎస్‌సీమోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్, జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ సులువ పద్మ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరిత, జిల్లా లేబర్ సెల్ కో కన్వీనర్ ఎల్తూరి రాజయ్యతో పాటు కోడూరి రమేష్, జనగామ సాగర్, మాదరబోయిన రాకేష్, కొట్టే నరేష్, తదితరులు పాల్గొన్నారు.