Share News

Peddapalli: ఘనంగా భాగ్యరెడ్డివర్మ జయంతి

ABN , Publish Date - May 23 , 2026 | 12:40 AM

పెద్దపల్లి కల్చరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

Peddapalli: ఘనంగా భాగ్యరెడ్డివర్మ జయంతి

పెద్దపల్లి కల్చరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మూఢ నమ్మకాల నిర్మూలన, దళితోద్దరణ, సమాజం లో సమానత్వం కోసం భాగ్యరెడ్డి చేసిన కృషి అనితర సాధ్యమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లాఅధికా రులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

భాగ్యరెడ్డి వర్మ నేటి తరానికి ఆదర్శనీయుడు

కోల్‌సిటీ : భాగ్యరెడ్డివర్మ నేటి తరానికి ఆదర్శప్రా యుడని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వ హించిన కార్యక్రమానికి మేయర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివా ళులు అర్పించారు. భాగ్యరె డ్డివర్మ సేవలని కొని యాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ పాతి పెల్లి ఎల్లయ్య, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీరతో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

జూలపల్లి : మండ లకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురు వా రం భాగ్యరెడ్డివర్మ జయం తిని తహశీల్దార్‌ కార్యాల య ఉద్యోగులు సిబ్బంది కలిసి ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను ఉద్యోగులు కొనియాడారు. కార్యక్ర మంలో గిర్దవరి మల్లికార్జున్‌రావు, మానస, శ్రీలత, చంద్ర మౌళి, భాస్కర్‌,రమేష్‌ పలువురు పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌ : మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం దళిత పితామహుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన పలువురు అధికారులు, నాయకులు ఆయన సేవలను గుర్తుకు చేసుకున్నారు. అలాగే మద్యపానం నిషేదం, బాల్య వివాహాలను రద్దు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రంగు సత్యనారాయణరెడ్డి, జూలపల్లి మాజీ ఎంపీటీసీ శవ్వ శంకరయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ వంశీ కృష్ణ, ఏపిఓ లావణ్య, జూనియర్‌ సహాయకులు శ్రీలత, టైపిస్టు సుజాత, కంప్యూటర్‌ ఆపరేటర్లు సుమన్‌, సంధ్య, గ్రామపంచాయతీ కారోబార్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రామగిరి : భాగ్యరెడ్డివర్మ జయంతిని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి తహసీల్దార్‌ సుమన్‌ పూలమాల వేసి ఘనంగా నివాళి ఆర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ రుద్రపట్ల మానస, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు మహేష్‌, రవిశంకర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ యశ్వంత్‌, నరేష్‌, రజిత, తిరుమల, శివ, దేవయ్య, వెంకటేశ్వర్లు, కలవేన రాజేశం, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:40 AM