Peddapalli: ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:47 AM
కమాన్‌పూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సేవలు అందేలా మండలరెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
కమాన్‌పూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సేవలు అందేలా మండలరెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయం, జడ్పీహెచ్‌ఎస్, జూలపల్లిలోని ఎంపీపీఎస్ పాఠశాల, జూలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలోని అంగన్‌వాడీకేంద్రాన్ని తనిఖీచేశారు. ఆయా కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జరుగుతున్న పనితీరు ను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు, సిబ్బంది పనిచేయా లని ఆదేశించారు. భూ పునఃసర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ లో భాగంగా జారీ చేసిన నోటీసులపై జరుగుతున్న విచారణ వివరాలను తెలుసుకున్నారు. జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధన విధానాలను పరిశీలిం చారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచిం చారు. జూలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో చిన్నారుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీచేసి చిన్నారుల హాజరు, ఆరోగ్యం, పోషకాహార పరిస్థితులను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఎస్‌ఏఎం, ఎంఏఎం కేటగిరీల్లో ఉన్న పిల్లలపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని ఆదేశించారు. వారి ఆరోగ్యం, పోషక స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రత్యేకసంరక్షణ అందించాలని సూచించారు.
30లోగా పంటల సర్వే పూర్తిచేయాలి
పెద్దపల్లి టౌన్/సుల్తానాబాద్ : జిల్లాలో పంటల డిజిటల్ సర్వేను వేగవంతం చేసి సెప్టెంబర్30లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పంటల సర్వేపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతు సాగు చేస్తున్న పంట వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో తప్పసరిగా నమోదు చేయాలని సూచించారు. సన్నరకం ధాన్యం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అందించే బోనస్ పొందేందుకు డిజిటల్ పంటల సర్వే వివరాలు కీలకమని తెలిపారు. ఏ ఒక్క రైతు కూడా బోనస్ కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏఈవోలు, వ్యవసాయ అధికారులు రైతులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో సర్వేను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికా రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.