Share News

Peddapalli: కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:44 AM

జ్యోతినగర్‌, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి): కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌కోడ్‌లను కేంద్రప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని ఐఎఫ్‌టీయూ జాతీయప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Peddapalli: కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

- ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌

జ్యోతినగర్‌, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి): కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌కోడ్‌లను కేంద్రప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని ఐఎఫ్‌టీయూ జాతీయప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎన్‌టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం జిల్లా అధ్యక్షుడు చిలుకశంకర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికులు సంఘాలు ఏర్పాటుచేసుకునే హక్కు, సమ్మెహక్కులను దెబ్బతీసే విధంగా కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చిందని ఆరోపించారు. అనంతరంజిల్లా కాంట్రా క్టుకార్మికుల సంఘం నూతనకార్యవర్గాన్ని ఎన్నుకున్నా రు. గౌరవఅధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడిగా నరేష్‌, ఉపాధ్యక్షుడిగా పుట్టపాక స్వామి, ప్రధానకార్యద ర్శిగా చిలుకశంకర్‌, సహాయకార్యదర్శిగా బుచ్చయ్య, కోశాధికారిగా పద్మ ఎన్నికయ్యారు. కార్యవర్గసభ్యులుగా రాజేశం, పెరికవెంకటస్వామి, దుర్గంరవీందర్‌, రాయ మల్లు, రాయమల్లమ్మ, శ్రీజ,లక్ష్మణ్‌, మత్సరాజేశం, యాదగిరి, కనకయ్య, జేకేస్వామి ఎన్నికయ్యారు. సమా వేశంలో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి కేరాజన్న, ఐఎఫ్‌టీయూ జిల్లాఅధ్యక్షుడు నరేష్‌, జీఎల్‌బీ కేఎస్‌ రామగుండం రీజియన్‌ ప్రధానకార్యదర్శి ఈదు నూరి రామకృష్ణ, పీసీకేఎస్‌ జిల్లానాయకులు పుట్టపాక స్వామి, బీ బుచ్చయ్య, పెరక వెంకటస్వామి, ఆర్‌ రాయమల్లు, కే పద్మ తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూసీఐకి చెందిన సత్యనారాయణరెడ్డి, తోకల రమేష్‌ ఐఎఫ్‌టీయూలో చేరారు.

Updated Date - Sep 21 , 2026 | 12:44 AM