Share News

Peddapalli: మరో రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:25 AM

ధర్మారం, మార్చి 1 (ఆంఽఽధ్రజ్యోతి): ధర్మపుని నియోజకవర్గానికి మార్చి నెలలో మరో రెండువేల ఇందిరమ్మ ఇళ్లు మంజూ రఅవుతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలి పారు.

Peddapalli:   మరో రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు

- కబ్జా చేసిన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం

- ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి

ధర్మారం, మార్చి 1 (ఆంఽఽధ్రజ్యోతి): ధర్మపుని నియోజకవర్గానికి మార్చి నెలలో మరో రెండువేల ఇందిరమ్మ ఇళ్లు మంజూ రఅవుతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలి పారు. ఆదివారం మండలంలోని గోపాల్‌ రావుపేట గ్రామంలో తాండ్ర రజితకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల విష యంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుం డా నేరుగా లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ 20వ వార్షికోత్సవం సంద ర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలుకగా మంత్రి పత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ది కోసం 10లక్షల రూపాయల నిధులు అందజేస్తామని హామీ ఇచ్చా రు. గ్రామంలోని పద్మశాలి సేవాసంఘ భవనానికి 5లక్షలు, ఎస్సీ కమ్యూనిటిహాల్‌ కోసం 5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గోపాల్‌ రావుపేట గ్రామంలో మహిళా సంఘాలకు గోదాం నిర్మాణం కోసం స్థలసేకరణ చేయాలని తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను ఆదేశించారు.

ఫ ప్రభుత్వ భూములను

స్వాధీనం చేసుకుంటాం..

గత ప్రభుత్వ పాలనలో మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఆ భూములను తిరిగి తీసుకొని పేదలకు పంచుతా మని మంత్రి ప్రకటించారు. మండలంలోని నర్సిం గాపూర్‌, ఖిలావనపర్తి, ధర్మారం గ్రామాల్లో ఎకరాల కొద్ది ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అన్నారు. వారు ఎంతటి వారైనా వదిలి పెట్టేదిలేదని హెచ్చరించారు. రెవెన్యూ అధి కారులు ప్రత్యేకడ్రైవ్‌ నిర్వహించి ఆక్రమణ భూములను గుర్తించి సంబంధిత పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు.

ఫ మేడారంలో వందశాతం

సోలర్‌ వెలుగులు

మండలంలోని మేడారంలో 100శాతం సోలార్‌ప్యానల్‌ ఏర్పాటుచేసి సౌర కాంతు లు విరజిమ్మేలా గ్రామన్ని తీర్చిదిద్దుతా మని మంత్రి అడ్లూరిచెప్పారు. తొలివిడత లో 1486విద్యుత్‌ కనెక్షన్లకు రెండు కిలోవాట్స్‌ సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రెండోవిడుతలో 628వ్యవసాయ పంపు సెట్లకు సోలార్‌ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలి పారు. వందశాతం సోలార్‌కోసం ప్రభుత్వం 51కోట్ల రూపాయలు విడుదల చేసిందని, విద్యుత్‌ విద్యుత్‌ లైన్ల మార్పిడికోసం మరో 36లక్షలు కేటాయించిం దని మంత్రి అడ్లూరి వివరించారు. కార్యక్రమాల్లో వివిదశాఖల అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:25 AM