Peddapalli: అభ్యర్థులందరూ ఎన్నికల నింబంధనలు పాటించాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:27 AM
పెద్దపల్లిటౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్, కార్పొరేషన్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఘా సూచించారు.
-సీపీ అంబర్‌కిషోర్‌ఝా
పెద్దపల్లిటౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్, కార్పొరేషన్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఘా సూచించారు. గురువారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు మైక్, వాహన అనుమతి పొందాలని ఉదయం 6నుంచి సాయంత్ర 6 వరకు మైక్‌తో ప్రచారం చేసుకోవచ్చని, ఆ తరువాత 10వరకు అభ్యర్థి ప్రచారం చేసుకోవచ్చన్నారు. 9నసాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాలని సూచించారు. ప్రచారంలో ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా చేసుకోవాలని, కుల,మత విభేదాలు సృష్టించరాదన్నారు. ప్రార్థన మందిరాలు, పాఠశాలలు, ఆస్పత్రుల వద్ద మైక్‌లు ఆఫ్ చేయాలని, ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి పొందాలన్నారు. 9న సాయంత్రం 5గంటల నుంచి 144 సెక్షన్ అమలులోకి వస్తుందని, నలుగురికి మించి తిరుగకూడదన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల దూరంలో ఉండాలని, గుర్తులు ప్రదర్శించవద్దని సూచించారు. ఓటర్లు 18రకాల ఐడీ కార్డులలో ఏదైనా తీసుకొని వచ్చి ఓటు వేయవచ్చన్నారు. ఆయన వెంట డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐలు ప్రవీణ్‌కుమార్, అనిల్‌కుమార్, ఎస్సై లక్ష్మన్‌రావు ఉన్నారు.