Peddapalli: వైభవంగా ఆది దంపతుల డోలోత్సవం..
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:44 AM
మంథని, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): హోలీ పండుగను పురస్కరించుకొని స్థానిక శ్రీసీలేశ్వర-సిద్దేశ్వరా యంలో, శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఆది దంపతుల డోలోత్సవాన్ని బుధవారం రాత్రి భక్తులు వైభవంగా నిర్వహించారు.
శైవ, వైష్ణవాలయాల్లో భక్తుల సందడి
మంథని, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): హోలీ పండుగను పురస్కరించుకొని స్థానిక శ్రీసీలేశ్వర-సిద్దేశ్వరా యంలో, శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఆది దంపతుల డోలోత్సవాన్ని బుధవారం రాత్రి భక్తులు వైభవంగా నిర్వహించారు. శివాలయంలో శివపార్వతుల, వైష్ణవ ఆలయంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన ఊయల్లో ఉంచారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజ లు జరిపారు. పూజ జరిగినంత సేపు స్వామి-అమ్మవారి విగ్రహాలపై కలశంలోని రంగునీళ్లను చిలకరిస్తూ.. ఊయలను ఊపారు. పూజ పూర్తి అయిన అనంతరం ఆది దంపతులకు భక్తులు పసుపు, కుంకుమ, బుక్క, గులాలు సమర్పించారు. శివరాత్రి రోజున జరిగే ఉమా-మహేశ్వరుల కల్యాణోత్సవం అనంతరం వచ్చే హోలీ పండుగను సందర్భంగా ఆది దంపతులకు ఈడోలోత్సవం 16రోజులపండుగను మంథనిలో లోకే రాధాకిష న్‌రావు కుటుంబసభ్యులు నిర్వహించడం అనా దిగా వస్తున్నది. ఈసందర్భంగా స్వామి, అమ్మ వార్లను కీర్తిస్తూ భక్తులు పాడిన హోలీ పాటలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో లోకే కుటుంబసభ్యులు, వేదపండితులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.