Share News

Peddapalli: రాష్ట్రంలో ప్రజావంచన పాలన సాగుతోంది

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:01 AM

మంథని, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా ప్రజా వంచనపాలన కొనసాగుతోందని బీఆర్‌ ఎస్‌పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Peddapalli: రాష్ట్రంలో ప్రజావంచన పాలన సాగుతోంది

బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి

మంథని, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా ప్రజా వంచనపాలన కొనసాగుతోందని బీఆర్‌ ఎస్‌పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఎస్‌ఎల్‌బీ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మంథని నియోజక వర్గ బీఆర్‌ఎస్‌పార్టీ సభ్యత్వ నమోదు, బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా నాశనంచేసే విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాత్ర ఎంత ఉంటదో మంత్రి శ్రీధర్‌ బాబుకుపాత్ర సైతం అంతే ఉంటుందన్నా రు. షాడోసీఎం అని చెప్పుకుంటున్న మంత్రి శ్రీధర్‌ బాబుకు సొంత నియోజకవర్గంలో రైతులవడ్ల కొను గోళ్లలో క్వింటాళుకు 8కిలోలు చొప్పున కటింగ్‌ పెట్టిన ప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. సీఎం ప్రతిరైతుదగ్గర రూ.6వేలు కమీషన్‌ తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఏడురకాల సన్నవడ్లకు మాత్రమే బోనస్‌ అంటూ రైతు లకు ఇచ్చే బోనస్‌సైతం ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నాడ న్నారు. రైతులే 5వందల బోనస్‌ మాకు ఎందుకు అనే ఆలోచనకు వచ్చారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో అభి వృద్ధిలో దూసుకుపోయిన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు విధానాల కారణంగా రివర్స్‌గేర్‌లో అంధకారంలోకి పోతోందన్నారు. మాజీమంత్రికొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రాబో యేది కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నని పార్టీ క్యాడర్‌ అంతా ధైర్యంగా పనిచేయలన్నారు. మాజీఎమ్మెల్యే పుట్టమధు మాట్లాడుతూ.. తనను మంత్రి శ్రీధర్‌బాబు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మంథని నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం వెనుకాడేది లేదన్నారు. తనప్రాణం ఉన్నంత వరకు మంథని నియోజకవర్గం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానన్నారు. కార్యక్రమంలో జక్కు శ్రీహర్షిణి-రాకేష్‌, రఘువీర్‌సింగ్‌, ఏగోళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, మాచీడి రాజుగౌడ్‌, కిషన్‌రెడ్డి, రవీందర్‌, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:01 AM