Share News

Peddapalli: ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:21 AM

పెద్దపల్లి, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): ఆక్రమితభూముల రిజి స్ట్రేషన్‌ ప్రక్రియపై సమగ్రనివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

 Peddapalli:  ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): ఆక్రమితభూముల రిజి స్ట్రేషన్‌ ప్రక్రియపై సమగ్రనివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలో ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, వీబీ జీరామ్‌జీ పథకం కింద మంజూరైన గ్రామాల్లో వీవో భవనాల నిర్మాణాల పురోగతిపై ఆయన గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆక్రమితభూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వా నికి, అధికారులకు, సంబంధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా ప్రక్రియను ఏవిధంగా చేపట్టాలనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. భూముల రిజిస్ట్రేషన్‌ విష యంలో స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని, ఎలాంటి గందర గోళానికి తావులేకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం వీబీ జీరా మ్‌జీ పథకం కింద జిల్లాలో మంజూరైన గ్రామాల్లో వీవోభవనాల నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తూ, మంజూరైన అన్ని భవనాల నిర్మాణ పనులను వేగవంతంచేసి నిర్ణీతగడువులోగా పూర్తిచేయాలని ఆదేశిం చారు. నిర్మాణపనుల్లో ఏవైనా అడ్డంకులుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికితీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, పూర్తయిన భవనాలను వెంటనే సంబంధిత సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో కాలిందిని, డీసీవో శ్రీమాల, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ వనజ,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 12:21 AM