Share News

Peddapalli: ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి సమగ్రప్రణాళిక రూపొందించాలి

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:34 AM

పెద్దపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి అన్ని జంక్షన్లను సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైనచర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

Peddapalli:  ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి సమగ్రప్రణాళిక రూపొందించాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి అన్ని జంక్షన్లను సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైనచర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లో డీసీపీ రామ్‌రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలోని అన్ని ప్రధాన జంక్షన్లను క్షేత్రస్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీకి గల కారణాలను గుర్తించి, నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్‌రద్దీని నియం త్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వన్‌వే, టూ-వే విధానాలను పరిశీలించి, ప్రయోగా త్మకంగా అమలు చేయాలని కలెక్టర్‌ సూచిం చారు. ఈ మార్పులను కనీసం ఒకవారం పాటు పరిశీలించి, ట్రాఫిక్‌ రాకపోకలపై వాటి ప్రభావం, ఫలితాలను అధ్యయనం చేసిన అనంతరం తగిననిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్‌నియంత్రణలో పోలీసు, మున్సిపల్‌, రోడ్లు భవనాలశాఖల అధికారులు సమన్వయంతో పనిచే యాలని సూచించారు. రోడ్లపై ఆవులు, గేదెలు, ఇతర పశువులు సంచరించడంవల్ల ప్రమాదాలు జరిగే అవ కాశం ఉన్నందున, వాటిని నియంత్రించేం దుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్ల య్య, ఆర్‌అండ్‌బీ ఈ ఈ భావ్‌సింగ్‌, ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, రోడ్లుభవనాలశాఖ అధి కారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సాంకేతికతను

తరగతి బోధనతో

అనుసంధానం చేయాలి

పెద్దపల్లిరూరల్‌: డిజిటల్‌ సాంకేతిక తను తరగతి బోధనతో అనుసంధానం చేయాలని కలెక్టర్‌ అన్నారు. పెద్దపల్లి మండ లంలోని పెద్దబొంకూర్‌ మదర్‌థెరిస్సా ఇంజినీ రింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న డిజిటల్‌ అక్ష రాస్యత శిక్షణ కార్యక్రమాన్ని ఆయన గురు వారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఉపా ధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణ లో అందిస్తున్న అంశాలను క్షుణ్ణంగా అవగా హన చేసుకోవాలన్నారు. శిక్షణలో నిర్దేశించిన అభ్యసన ఫలితాలను విద్యార్థులు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రతివిద్యార్థి నిర్దేశితఅభ్యసన ఫలి తాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.ఖాన్‌ అకాడమీఅందించే డిజిటల్‌వనరులను సమర్థవంతంగా విని యోగిస్తూ, విద్యార్థుల అభ్యసనస్థాయిని ఎప్ప టికప్పుడు గుర్తించి, వారిపురోగతిని నిరంత రం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటల్‌ సాంకేతికతను తరగతిగది బోధనతో సమర్థ వంతంగా అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలని తెలిపారు. పీఎం షేక్‌ పాల్గొని ఉపాధ్యాయులకు శిక్షణకు సంబం ధించిన పలుఅంశాలపై మార్గదర్శకత్వం చేశారు. డిజిటల్‌ అక్షరాస్యతశిక్షణలో జిల్లా లోని 14మండలాలకు చెందిన గణిత ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.ఖాన్‌అకాడమీ మార్గ దర్శకాల ప్రకారం శిక్షణను నాణ్యతతో అమ లుచేసి, విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను సాధించేందుకు కృషి చేయనున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:34 AM