Share News

Peddapalli: సీఐటీయూ ఆధ్వర్యంలో 2కే రన్‌

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:03 AM

గోదావరిఖని, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జైల్‌ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యం లో

Peddapalli:  సీఐటీయూ ఆధ్వర్యంలో 2కే రన్‌

క్విట్‌ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి

గోదావరిఖని, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జైల్‌ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యం లో ఆదివారం 2కేరన్‌ నిర్వహించారు. గోదావరిఖని సీఐటీయూ ఆఫీసు శ్రామికభవన్‌ నుంచి కూరగా యల మార్కెట్‌ వరకు ఈ రన్‌ కొనసాగింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ క్విట్‌ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఆగస్టు10న జైల్‌భరో కార్యక్ర మంలో పెద్దసంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయ వంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించా ల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్‌ కోడ్లను వెంటనే రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మెండె శ్రీనివాస్‌, కోశాధికారి ఎం రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాంరెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్‌, జనార్దన్‌రెడ్డి, అఖిల్‌, కుంభం కిషన్‌, కే సురేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:03 AM