Share News

peddapali : ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:18 AM

ఎలిగేడు, సెప్టెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వభూములు అక్రమణకు గురికాకుండా చూడాలని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

peddapali  : ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి

- ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

ఎలిగేడు, సెప్టెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వభూములు అక్రమణకు గురికాకుండా చూడాలని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం ఉద్యాన, పట్టు పరి శ్రమశాఖ సహకారంతో మండలం శివ పల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రెండు ఎకరాల్లో చదునుచేసిన ప్రభుత్వభూమిలో గ్రామస్తులతో కలిసి ఆయిల్‌పామ్‌ మొక్క లను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దాదాపు 2ఎకరాలల్లో పామాయిల్‌ తోటను పెట్టామన్నారు. ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉండకుండా గ్రామస్తుల ఆలోచన మొక్కలు నాటామన్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఆధ్వ ర్యంలో పొడి,తడి చెత్తవ్యర్థ్థాలు వేరుచేసే కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొన్నారు. తడి, పొడిచెత్త, వ్యర్థాలు వేరుచేసి పారి శుధ్య సిబ్బంది వచ్చినప్పుడు అందజేయాలన్నారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ దుగ్యాల వాణిగోపాల్‌రావు, ఉపసర్పంచ్‌ సౌజన్య అనిల్‌, డీఆర్డీవో కాలిందని, సీఈవో కేషుకళ్యాణ్‌, డీఎ ల్పీవో దేవకీదేవి, తహసీల్దార్‌ యాక న్న, ఎంపీడీవో భాస్క ర్‌రావు, ఏవో ఉమా పతి, కార్యదర్శి నిశాం త్‌రావు, ప్లాంటేషన్‌ అధికారి అభిలాష్‌, గ్రామపాలకవర్గం, గ్రామస్థులున్నారు.

విద్యార్థులకు పౌష్టిక ఆహారం దేశంలోనే మొదటిది

ఓదెల : తెలంగాణలో విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేయడం దేశంలోనే మొదటిదని విప్‌ విజయరమణా రావు అన్నారు. మండల కేంద్రంలోని మోడల్‌హైస్కూల్‌లో సోమవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పా హారాన్ని హరేరామకృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహారాన్ని ఆయన విద్యార్థులకు వడ్డించి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వపాఠశాలల్లో ప్రహరీలు, మరుగుదొడ్లు, ఇతర ఆధునికీకరణ పనుల నిర్మాణాలు రూ.65కోట్లతో పూర్తయి నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.రెండు కోట్లతో ఇంటిగ్రేటేడ్‌ పాఠశాల నిర్మాణపనులు జరుగుతున్నా యన్నారు. మిగిలిన పనులను సంవత్సరకాలంలో పూర్తిచేస్తా మన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వనజ, ఎంపీడీవో అనిల్‌రెడ్డి, ఎంఈవో రమేష్‌, సర్పంచ్‌ కనికిరెడ్డి సతీష్‌, సింగిల్‌ విండోచైర్మన్‌ ఆళ్లసుమన్‌రెడ్డి, మాజీచైర్మన్‌ గోపునారాయణ రెడ్డి, అధికార ప్రతినిధి బైరిరవిగౌడ్‌, ఆలయ మాజీచైర్మన్‌ చీక ట్ల మొండయ్య వివిధగ్రామాల సర్పంచులు,ఉపసర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మండపాలను సందర్శించిన విప్‌

సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయకమండపాలను సోమవారం ప్రభుత్వవిప్‌ విజయరమణారావు సందర్శించారు. సుగ్లాంపల్లి గనేష్‌ మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానంచేశారు. కార్యక్రమంలో మున్సి పల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, చైర్మన్‌ క్రిష్ణ, వైసచైర్‌పర్సన్‌ అంతటి పుష్షలత, డాక్టర రమేష్‌, పన్నాల రాములు, ఈర్ల స్వరూప శేఖర్‌, దుగ్యాల సంతోష్‌ రావు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 01:18 AM