Share News

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:57 PM

దేశవ్యాప్త నీట్‌ పరీక్ష లీక్‌, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ గురువా రం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు శాం తియుత నిరసన ర్యాలీని చేప ట్టారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ

సిరిసిల్ల టౌన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్త నీట్‌ పరీక్ష లీక్‌, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ గురువా రం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు శాం తియుత నిరసన ర్యాలీని చేప ట్టారు. ముందుగా స్థానిక అం బేద్కర్‌చౌరస్తా నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతిని ధులు గాంధీచౌక్‌ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేస్తూ గాంధీచౌక్‌ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దిష్టిబొమ్మను దహనం చేయగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాం గ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీని వాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు మాట్లాడారు. నీటి పరీక్ష నిర్వహ ణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని ఆరోపించారు. నీట్‌ పరీక్ష లీక్‌ వ్యవహారంలో విద్యార్థులు తమకు జరి గిన అన్యాయంపై దేశవ్యాప్తంగా శాంతియు తంగా నిరసనలు తెలిపితే ప్రతిపక్ష పార్టీ లు పూర్తి మద్దతు ఇచ్చాయన్నారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా నిర సనలు తెలపడానికి వచ్చిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించ డాన్ని నిరసిస్తూ రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ నాయకులు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారన్నారు. రాహుల్‌గాం ధీపై దాడిచేసి గాయపరచడమే కాకుండా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. బీ జేపీ నిరంకుశ పాలనకు చలిం చిపోయి ఎల్లారెడ్డిపేట మండ లానికి చెందిన వంశీ సర్‌ ఫా రంపై సూసైడ్‌నోట్‌ రాసి ఆత్మ హత్యకు పాల్పడడం దురదృష్టక రమన్నారు. ఇప్పటికైనా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్‌ పరీక్ష లీక్‌పై విద్యార్థులకు క్షమాపణ చెప్పాల ని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శు లు రాగుల జగన్‌, వేముల దామోదర్‌,ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆకునూరి బాల రాజు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ రియాజ్‌, యూత్‌కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజ్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్లు బొద్దుల శ్రీని వాస్‌, లింగంపల్లి గంగరాజు, శ్రీశైలం, ము న్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవ య్య, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ రవీందర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మ న్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:57 PM