Share News

ఓట్‌ చోరీ కాకుండా కార్యకర్తలు కృషి చేయాలి

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:04 AM

ఓట్‌ చోరీ కాకుండా ప్రతి కార్యకర్తల సైనికుని వలె పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు.

ఓట్‌ చోరీ కాకుండా కార్యకర్తలు కృషి చేయాలి

భగత్‌నగర్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఓట్‌ చోరీ కాకుండా ప్రతి కార్యకర్తల సైనికుని వలె పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజక వర్గ బీఎల్‌ఏ-2 సభ్యుల శిక్షణ కార్యక్రమం కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌ సానుభూతిపరులు, లౌకికవాద ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడుతుందన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్‌ నాయకుడు, కార్యకర్త ప్రజా ప్రతినిధి చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్‌, పీసీసీ ఉపాధ్యక్షడు నమిండ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రత్యక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో బూత్‌ స్థాయి నాయకులు, ఏజెంట్లు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పాల్గొని ప్రతి ఓటును రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. సమావేశంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, అర్బన్‌ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సన్న, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:04 AM