Share News

పర్యావరణ పరిరక్షణలో భాగస్యాములు కావాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:19 AM

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్యాములు కావాలి

ఎల్లారెడ్డిపేట, జూన్‌5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌ గ్రామశివారులోని అర్బన్‌ పార్కులో అట వీ శాఖ ఆధ్వర్యంలో ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్క లు నాటారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేపర్‌ ప్లేట్లు, గ్లాసుల స్టాన్‌ను పరిశీలించారు. తయారీ విధానం, వినియోగ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన గాలి, హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అడవుల శా తం అధికంగా ఉంటేనే వర్షాలు సమృద్ధి గా కురుస్తాయన్నారు. పల్లెలను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి గ్రామంలో నర్సరీల ద్వారా ఇంటికి మూడు మొక్కలు అందిస్తామన్నారు. చంటిపాపల్లా పాతి కాపాడాలన్నారు. ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యవంతులను చేయాలని అన్నారు. స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని సూ చించారు. హరిదాస్‌నగర్‌లో స్టీల్‌ బ్యాంకును ఏర్పాటు చేయడంపై సర్పంచ్‌ నాగరాజును అభినందించారు.

Updated Date - Jun 06 , 2026 | 12:19 AM