Share News

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకుంటున్న పార్టీలు

ABN , Publish Date - May 04 , 2026 | 12:25 AM

మహిళలకు 33 శాతం రిజర్వే షన్‌లను కల్పించేందుకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డుకోవడం శోచనీయమని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకుంటున్న పార్టీలు

సిరిసిల్ల అర్బన్‌, మే 3 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు 33 శాతం రిజర్వే షన్‌లను కల్పించేందుకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డుకోవడం శోచనీయమని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్య క్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ గతంలో అనేకసార్లు అడ్డంకులు సృష్టిం చిందన్నారు. రైతుల సమస్యలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పట్టించు కోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో ధాన్యంలో కోతలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. హిందూ పండుగల విషయంలో ఈ రెండు పార్టీల వైఖరి ప్రజలకు అర్థ మైందన్నారు. కేంద్రంలో బీజేపీ మూడవసారి గెలుపొందగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా భాధ్యతలను స్వీక రించిన తర్వాత తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రూ.7800 కోట్లకు పైగా విలువైన పలు కీలక ప్రాజెక్టులను ప్రాంభించారని అన్నారు. ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభకు గ్రామస్థాయితో పాటు పట్టణాల్లో వార్డు స్థాయి నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలను తరలించేందుకు ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ రావు, మీసాల చంద్రయ్య, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:25 AM