పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా పరిపాలించాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:16 AM
జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు తెలంగాణ పంచాయ తీరాజ్ చట్టానికి అనుగుణంగా పరిపాలించాలని ఇన్ చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
వేములవాడ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు తెలంగాణ పంచాయ తీరాజ్ చట్టానికి అనుగుణంగా పరిపాలించాలని ఇన్ చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాష్ట్ర ప్రభు త్వం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల సర్పంచులకు పట్టణంలోని జవ హర్‌లాల్ నెహ్రూ బీఈడీ కళాశాలలో ఐదు రోజుల శిక్ష ణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అభినందనలు తెలియజేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 1/3 కోరం ఉండేలా చూసుకోవాలని, ప్రతి ఏడాది ఆరు గ్రామసభలు నిర్వ హించాలని, గత సమావేశం అంశాలు,తీర్మానాలు చర్చిం చాలన్నారు. ప్రస్తుత సమావేశంలో ప్లానింగ్, అమలుపై చర్చించాలని సూచించారు. మహిళల కోసం, వృద్దులు, అనాథలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర ఆరోగ్య సమా వేశాలు నిర్వహించాలని తెలిపారు. నిధుల దుర్వినియో గం కాకుండా చూడాలని, ప్రతి అభివృద్ధి పనినీ గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే చేయాలని స్పష్టం చేశారు. అన్ని రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని తెలిపా రు. ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు నిత్యం చేయిం చాలని, ఇళ్లు, ఆయా ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుం డా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోని డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్లు వినియోగంలోకి తీసుకురావా లని, తడి, పొడి చెత్తను వాహనాల్లో సేకరించి, వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని, తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేయాలని సూచించారు. పొడిచెత్తను విక్రయించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త ను తగలబెట్టవద్దని స్పష్టం చేశారు. దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రతి వారంలో శుక్రవారం డ్రై డేగా పాటించాలని, ఇళ్లలో మొక్కల కుండీలు, కూలర్లు, వినియోగించిన కొబ్బరి బొండాల్లో నీరు నిలువకుండా చూడాలన్నారు. మంచినీటి సరఫరా పై దృష్టి సారించాలని, ప్రతి నెలా 1, 11, 21వ తేదీల్లో ట్యాంక్‌ల్లో నీటిని తీసివేసి, బ్లీచింగ్ ఫౌడర్‌తో శుభ్రం చేయించాలని, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దగ్గరుం డి చూడాలని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పె ట్టుకుని గ్రామాల్లో ఉన్న నీటి వనరులు చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నీటి సరఫరా, రానున్న రోజుల్లో నీటి సరఫరా ఏమి కావాలో ముందుగానే అంచనా వే యాలని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా ఒక ప్రణా ళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. గ్రామ బడ్జెట్‌లో 10 శాతం మొక్కల పెంపకం, సంరక్షణ కు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశారు. వీధి దీపాల నిర్వహణను చూసుకోవాలని వివరించారు. ప్రభు త్వ ఆదాయ వనరుల కేటాయింపుతో పాటుగా స్థానిక ఆదాయ వనరులు చూసుకోవాలని సూచించారు. ఇంటి, ఇతర పన్నులు వసూలు చేయాలని, వివిధ దుకాణాలు కొనసాగించేవారికి లైసెన్స్‌లు జారీచేయాలని, ప్రతి నూ తన గృహ నిర్మాణాలకు పర్మిషన్ ఇ వ్వాలని తెలిపారు.
భవన నిర్మాణాలు చేపట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిం చాలన్నారు. లబ్ధిదారులతో పనులు వేగంగా పూర్తి చేసే లా చూడాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీకి నూతన బిల్డింగ్ ఉండాలని, పెద్ద గ్రామపంచాయతీలలో మహిళా సంఘాలకు భవనాలు నిర్మించుకునేందుకు రూ.10 లక్షల నిధులు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ నుంచి మంజూరు అవుతాయని, మిగతా రూ. 10 లక్షలు గ్రామపంచాయతీ లేదా మహిళా సంఘాల ఖాతాల ని ధులు వినియోగించేలా ప్రతిపాదనలు పంపాలని సూ చించారు. హెల్త్ సబ్ సెంటర్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు తుది దశల్లో ఉంటే దృష్టిసారించి పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి షరీపుద్దిన్, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్‌రావు, ఆయా మండలాల ఎంపీడీవోలు తదితరులు ఉన్నారు.