పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:02 AM
పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని పద్మశాలి కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి శ్రీనివాస్, తెలంగాణ హ్యండ్లూమ్ టెక్స్‌టైల్ చైర్మెన్ దూడం వెంకటరమణ అన్నారు.
సుభాష్‌నగర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని పద్మశాలి కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి శ్రీనివాస్, తెలంగాణ హ్యండ్లూమ్ టెక్స్‌టైల్ చైర్మెన్ దూడం వెంకటరమణ అన్నారు. ఆదివారం నగరంలోని పద్మశాలి కల్యాణ మండపంలో పోపా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ ప్రతిభా పురస్కారాలు విద్యార్థులను ఎంతో ఉత్తేజరుపస్తాయన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతోపాటు ఉద్యోగులకు పద్మ, రత్న అవార్డులను అందచేయడం సంతోషకరమన్నారు. పద్మశాలీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. వోపా జిల్లా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు ప్రతిభా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్తులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. పద్మశాలీ జర్నలిస్టులకు పద్మరత్న అవార్డులను అందజేశారు. అనంతరం రిటైర్డ్ ఆర్డీవో మహేశ్వర్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో పోపా ప్రధాన కార్యదర్శి ఎలిగేటి మల్లికార్జున్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్, జిల్లా సంక్షేమశాఖ అధికారి సరస్వతి, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, పోలీసు సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మామిడాల సురేందర్, తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర వ్యవహారాల కమిటి చైర్మెన్ వాసాల రమేశ్, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం పాల్గొన్నారు.