ఒత్తిడిని అధిగమించండి..
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:09 AM
క్రీడలపై దృష్టి సారించి ఒత్తిడిని అధిగమించాలని పోలీస్ కమిషనర్ గౌ్‌స్ ఆలం విద్యార్థులకు సూచించారు. ‘యాంటీ డ్రగ్ అవేర్‌స్ వీక్’ కార్యక్రమాలు జిల్లాలో కొనసాగుతున్నాయి.
కరీంనగర్ క్రైం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): క్రీడలపై దృష్టి సారించి ఒత్తిడిని అధిగమించాలని పోలీస్ కమిషనర్ గౌ్‌స్ ఆలం విద్యార్థులకు సూచించారు. ‘యాంటీ డ్రగ్ అవేర్‌స్ వీక్’ కార్యక్రమాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ, మహి ళా శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి మాదకద్రవ్యాల దుర్వినియోగం(డ్రగ్ అబ్యూస్) అని తెలిపారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు కృషి చేస్తున్నాయన్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా యువతలో ‘స్వీయ నియంత్రణ’ ఉన్నప్పుడే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండవచ్చన్నారు. అంతకు ముందు నిర్వహించిన ర్యాలీలో నర్సింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. గీతాభవన్ చౌరస్తాలో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సరస్వతి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్ పాల్గొన్నారు.