Share News

ట్రాఫిక్‌ నియంత్రణకు ఔట్‌పోస్ట్‌ బూత్‌లు

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:04 AM

నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలను నియంత్రించేందుకు ఔట్‌పోస్ట్‌ బూత్‌లు ఉపయోగపడుతాయని పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు.

 ట్రాఫిక్‌ నియంత్రణకు ఔట్‌పోస్ట్‌ బూత్‌లు
ట్రాఫిక్‌ ఔట్‌పోస్ట్‌ బూత్‌ను ప్రారంభిస్తున్న సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలను నియంత్రించేందుకు ఔట్‌పోస్ట్‌ బూత్‌లు ఉపయోగపడుతాయని పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. నగరంలో తెలంగాణ చౌక్‌, మంచిర్యాల చౌక్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ ఔట్‌పోస్ట్‌ బూత్‌లను సీపీ గౌస్‌ ఆలం శనివారం ప్రారంభించారు. ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరి స్వామితో పాటు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్‌, అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 01:04 AM