Share News

వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలి

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:46 PM

వరికి బదు లు రైతులు ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసా య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలి

వేములవాడ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వరికి బదు లు రైతులు ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసా య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతు నేస్తం 100 ఎపిసోడ్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమ హైదరాబాద్‌ నుంచి మంగళవారం మంత్రి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ మేర కు వేములవాడ అర్బన్‌ మండలం మారుపాక రైతు వేదిక నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ వ్యవసాయాన్ని సులభంగా, లాభసాటిగా మా ర్చేందుకు సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ పంటల సాగు వల్ల అధిక లాభాలు వస్తాయని వివరించారు. నేల స్వభావం, నీటిలభ్యత, దిగుబడి, మార్కెటింగ్‌ సౌక ర్యం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రైతు పంట మార్పిడి విధానాలు పాటించాలని పేర్కొన్నారు. మోతాదుకు మించి ఎరువులను వాడరాదని తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రపంచ సమాచారాన్ని మొత్తం రైతు ముంగిల్లో అందుబాటులో పెడుతున్నామ ని తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో రైతు నేస్తం కార్య క్రమంలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతుల్లో పంటలకు సం బంధించి అనేక అంశాలపై అవగహన కల్పిస్తున్నామని తెలిపారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులు తప్పనిసరి ప్రతి రోజు రైతుల మధ్య ఉండాలన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దు : కలెక్టర్‌

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలపై దృష్టిసారించాలని కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. మారుపాక గ్రామం లో చేపట్టిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని వెల్లడించారు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయిందని తెలిపారు. వేములవాడ అర్భన్‌ మండలంలో 20మీటర్ల లోతులోకి వెళ్లా యన్నారు. జిల్లాలోని ఎగువ మానేరు, శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేరు), మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటికి సరిపోతుందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు చేయ వద్దని సూచించారు. మార్కెట్‌ డిమాండ్‌, నేలకు అనుకూలమైన పంటలు సాగు చే యాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని, సీఎం ప్రారంభించారని గుర్తు చేశారు. అయిల్‌ పామ్‌ సాగు చేస్తే మూడు ఏండ్ల తర్వాత దిగుబడి వస్తుందని వివరించారు. అలాగే రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్న లు, నువ్వులు, మొక్కజొన్న పంటలు ఇప్పటికీ వేయ వచ్చని వెల్లడించారు. రైతులకు కావలసిన విత్తనాలు సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డివిజన్‌ ఆత్మ కమిటీ చైర్మ న్‌ ముస్కు ముకుందరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొం డి రాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అప్జల్‌ బేగం, రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త సాయికుమార్‌, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌, తహసీల్దార్‌ జయంత్‌ కుమా ర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:46 PM