Share News

ఆపరేషన్‌ స్మైల్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:29 AM

బాలకార్మికు నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిద్దామని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు.

ఆపరేషన్‌ స్మైల్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

సిరిసిల్ల రూరల్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : బాలకార్మికు నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిద్దామని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఆపరేషన్‌ స్మైల్‌టీంతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా 13 రోజుల్లో 28 మంది పిల్లలను రెస్క్యూ చేసి పట్టుకుని జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ముందు హాజరుపరుచగా పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించి వారికి అప్పగించినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జిలా ్లలో ఉన్న పరిశ్రమలు, హోటల్స్‌, వ్యాపార సముదాయాలు, గోదా ములు, మెకానిక్‌ దుకాణాలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో వ్యూ హాత్మాకంగా తనిఖీలు నిర్వహించి ఆపరేషన్‌ స్మైల్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమా శాఖ అధికారి లక్ష్మీరాజం, చైల్డ్‌వెల్ఫేర్‌ చైర్మన్‌ అంజయ్య, ఎస్‌ఐలు ఎల్లయ్య గౌడ్‌, లక్‌పతి, డాక్టర్‌ నయిమ్‌జహార్‌, ఏఎస్‌ఐ ప్రమీల, మహిళా కాని స్టేబుళ్లు శ్రీలత, ప్రియాంక, గంగరాజం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:29 AM