ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:01 AM
జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్-12ను ఈనెల 31వరకు చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్-12ను ఈనెల 31వరకు చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు. కలెక్ట రేట్‌లో శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్-12పై వివిఽధ శాఖల అధికారుల తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ తప్పిపోయిన, పారిపోయిన పిల్లలతోపాటు బాలకార్మికులుగా మారిన వారిని సంరక్షించి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీవరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తప్పపోయిన, పారిపోయిన పిల్లలను వెతిపట్టుకునేందుకు ప్రభుత్వం నిర్ధేశించిన దర్పన్ యాప్‌ను వినియోగించాలని సూచించారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్‌లలో పిల్లల మిస్సింగ్‌కు సంబంధించిన సమాచారం తీసుకుని అన్ని విభాగాలు సమన్వయంతో వారిని గుర్తించేందుకు చేర దీసేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ఇటుక బట్టీలు, బేకరీ దుకా ణాలు, మెకానిక్ దుకాణాలు, ఇళ్ల నిర్మాణాల పనులు, వ్యవసాయ పనులతోపాటు ఇతర పనులల్లో బాలకార్మికులతో పనిచేయించుకోవ డం నేరమని స్పష్టం చేఽశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకార్మికు లను పనుల్లో పెట్టుకున్న యజమానులపై కఠినంగా వ్యవహరించాల న్నారు. ఎఫ్‌ఐఅర్ నమోదు చేసి విచారించాలని సూచించారు. అలాగే బాలకార్మికులుగా మారిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తూ వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఆలయాల ప్రాంతంలో భిక్షాటన చేసే పిల్లలను, ఖాళీగా తిరుగుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడే పిల్ల లను గుర్తించాలని సూచించారు. వారిని రెసిడెన్షియన్ విద్యాలయాల్లో చేర్పించాలని పేర్కొన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కౌన్సెలింగ్ నిర్వహించి విద్యారంగం వైపు వెళ్లేలా చూడాలన్నారు. ఒకవేళ విద్యపై ఆసక్తి లేకపోతే ఏదైనా శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని, ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్, న్యాక్‌లాంటి సంస్థల సేవలను వినియోగిం చుకోవాలని సూచించారు. బస్టాండ్‌లతో పాటు బస్సుల్లో ఎవరైనా అనా థపిల్లలు, మహిళలు కనిపిస్తే 1098కు కాల్ చేయాలని రవాణాశాఖ, ఆర్టీసీ డిపో మేనేజర్‌లు, సిబ్బందికి సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌శాఖ, మున్సిపల్ దేవాదాయ శాఖ, స్వయం సహాయక సంఘాలు సమన్వయంతో పిల్లల సమాచారాన్ని అందించి వారి భవిష్యత్తు కోసం సహకరించాలని కోరారు. బాలకార్మిక చట్టం అమలు కోసం లేబర్ అఽధికారి తప్పనిసరిగా అన్నింటిని తనిఖీలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికా రి జయశ్రీ, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్మ న్ అంజయ్య, సభ్యులు ఖాజా, ఐసీపీఎస్ మిషన్ వాత్సల్య సిబ్బంది కవిత, అంజయ్య, గగన్ తదితరులు పాల్గొన్నారు.