Share News

ప్రశాంతంగా ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు..

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:18 AM

జిల్లాలో ఏప్రిల్‌లో జరిగే ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిం చాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ కోరారు.

ప్రశాంతంగా ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు..

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఏప్రిల్‌లో జరిగే ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిం చాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ కోరారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌ లో ఓపెన్‌ పరీక్షలపై సంబంధిత అధికారులతోపాటు ఇంటర్మీడియేట్‌, విద్యాశాఖ, విద్యుత్‌, పోస్టల్‌, పోలీస్‌, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ శాఖ అధికారుల తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి 27వతేదీ వరకు ఓపెన్‌ ఇంటర్మీ డియేట్‌, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సిరిసిల్లలో మూడు సెంటర్‌లు, వేములవాడలో రెండు సెంటర్‌లలో జరుగునున్నాయని అన్నారు. అలాగే 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్ష ఒకే సెంటర్‌లలో జరుగుతుందన్నారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 12:18 AM