Share News

ఈ-కేవైసీకి రెండు రోజులే

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:36 AM

రేషన్‌ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. రేషన్‌ కార్డుల్లో పేర్లున్న సభ్యులంతా తప్పనిసరిగా చౌక ధరల దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలి.

ఈ-కేవైసీకి రెండు రోజులే
ఈ కేవైసి గడువు ముగుస్తుండటంతోకిక్కిరిసి పోతున్న ఆదార్‌ కేంద్రం

కరీంనగర్‌ రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. రేషన్‌ కార్డుల్లో పేర్లున్న సభ్యులంతా తప్పనిసరిగా చౌక ధరల దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలి. నకిలీ కార్డుల ఏరివేతతో పాటు మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు కార్డుల్లో తొలగించడంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గడువు రెండు రోజులే ఉండగా రేషన్‌ దుకాణాలు మూసి ఉండటంతో కార్డుదారులు ఆందోళన చెంతున్నారు. ఇంకా చాలా మంది ఈ-కేవైసీ చేయించుకోలేక పోయారు. డీలర్లు దుకాణాలు తెరిచి ఉంటే తప్ప వంద శాతం ఈ-కేవైసీ వందశాతం పూర్తి కాదు. ఆధార్‌ అప్‌డేట్‌ లేనివారికి ఈ-కేవైసీ కావడం లేదు. దీంతో జనం ఆధార్‌ కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఈ-కేవైసీని మరికొన్ని రోజులు పొడిగించాలని రేషన్‌ కార్డు లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:36 AM