Share News

ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - May 20 , 2026 | 12:16 AM

ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ జూలై తర్వాత ఉండే అవకాశాలున్నాయని తెఉలిపారు.

ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

కరీంనగర్‌ టౌన్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ జూలై తర్వాత ఉండే అవకాశాలున్నాయని తెఉలిపారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో పీఆర్టీయూ టీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఎస్సెస్సీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 139 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, 70 మంది మండలస్థాయి టాపర్‌ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఏకీకృత సర్వీస్‌ రూరల్స్‌ ఇప్పించే బాధ్యత తనదని, ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్లుగా, మండల విద్యాధికారులుగా, డిప్యూటీ డీఈవోగా పదోన్నతులు వస్తాయన్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలో ఉద్యమకార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే ప్రభుత్వాలను ఎన్నుకోవలసి వస్తుందని హెచ్చరించారు. టెట్‌ గురించి ఏ ఉపాధ్యాయుడూ అభద్రతా భావానికి గురికావద్దన్నారు. పీఆర్‌టీయు అధికారప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాశాఖ చేసిన కృషిని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేసి ఉపాధ్యాయులకు చేరువ కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్‌రెడ్డి, పత్రిక సంపాదకవర్గ సభ్యుడు అబ్దుల్‌ జమీల్‌, అకాడమిక్‌ కమిటీ సభ్యుడు శ్రీకాంత్‌రావు, సోషల్‌ మీడియా సభ్యులు లక్ష్మినారాయణ, జాలి మహేందర్‌రెడ్డి, జాలి రాఘవరెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాగేశ్వర్‌రావు, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆనందం, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:16 AM