పర్యావరణహిత మట్టి వినాయకులను పూజించాలి
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:23 AM
భవిష్యత్తు తరల కోసం పర్యావరణను పరిరక్షించాలని అందుకోసం మనం మట్టి వినాయకులను పూజించాలని బీఆర్‌ఎస్ సిరిసిల్ల నియోజక వర్గం ఇన్‌చార్జి తుల ఉమ అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : భవిష్యత్తు తరల కోసం పర్యావరణను పరిరక్షించాలని అందుకోసం మనం మట్టి వినాయకులను పూజించాలని బీఆర్‌ఎస్ సిరిసిల్ల నియోజక వర్గం ఇన్‌చార్జి తుల ఉమ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ బీఆర్‌ఎస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి తుల ఉమ, మున్సి పల్ చైర్‌పర్సన్ కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శవంతమైన సంస్కృతి సాంప్రదాయాలను కాడుకుంటూనే పర్యావరణాన్ని కూడా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్లాస్టర్ ఆప్ ప్యారిస్, రసాయన రంగులతో తయారైన వినాయకుల ప్రతిమల నిమజ్జనం చేశాక నీటిలో కరగక పోవడం వల్ల నీరు కలిషితమై అందులో జలచరాలు చనిపోయే అవకాశాలు ఉంటాయన్నారు. సాధ్యమైనంత వరకు మట్టి వినాయకులను ప్రతిష్టించుకొని పూజించుకొని పర్యావరణాన్ని సంరక్షించుకుందామన్నారు. అనం తరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, పట్టణ మహిళ అధ్యక్షు రాలు బత్తుల వనజ, మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్, కౌన్సి లర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.