పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:24 AM
సర్పంచ్ పదవికి వన్నె తెచ్చే విధంగా పని చే యాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అ న్నారు.
వేములవాడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ పదవికి వన్నె తెచ్చే విధంగా పని చే యాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అ న్నారు. వేములవాడ నియోజకవర్గంలో నూత నంగా ఎన్నికైన సర్పంచుల ఓరియంటేషన్ కార్య క్రమంలో ప్రభుత్వ విప్ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లా డుతూ సర్పంచులు వ్యక్తిగత సమస్యలకు తావి వ్వకుండా గ్రామాభివృద్ది, ప్రజా సమస్యల పరి ష్కారంపైనే దృష్టిపెట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరి షత్తుల మధ్య నిధుల కేటాయింపులో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరి ష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా అవ సరాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారో ప్రజలు దగ్గ రగా చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించాల నే లక్ష్యంతో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యు కేషన్ స్కూల్స్‌ను 25 ఎకరాల్లో, ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించి నప్పుడు ప్రజల ఆదరణ లభి స్తుందని సూచించారు. సర్పంచ్ పదవి నుంచే ఎమ్మెల్యే స్థాయికీ ఎదగ డానికి పునాది పడుతుం దని వివరించారు. గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నూతన సర్పంచ్ పాలకవర్గం గ్రామాల అబివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.