Share News

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:40 AM

మత్తుపదార్తాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా యువత క్రీడా మైదానాల్లో ఉండాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : మత్తుపదార్తాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా యువత క్రీడా మైదానాల్లో ఉండాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం రంగినేని సుజాత మోహన్‌రావు ట్రస్టులో ఎస్‌జీఎఫ్‌ తెలం గాణ రాష్ట్ర స్థాయి అండర్‌ - 19 బాలికల క్రికెట్‌ పోటీలను ముఖ్యఅతిథి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి అండర్‌-19 బాలికల క్రికెట్‌ పోటీలు ఈనెల 13 వరకు కొనసాగను న్నాయి. ఉమ్మడి పది జిల్లాల జట్ల మధ్య లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో నిర్వాహకులు క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వ లన చేసి క్రీడాకారిణీల గౌరవ వందనాన్ని ముఖ్య అతిథి ఆది శ్రీనివాస్‌ స్వీకరించి ఒలంపిక్‌ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సం సీఎం కప్‌ క్రీడా పోటీలను గ్రామ స్థాయి నుంచి నిర్వహిస్తోంద న్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైదరా బాద్‌లో స్పోర్ట్‌ యూనివర్శిటీని తీసుకురావడం జరిగిందని క్రీడలపై మక్కు వ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆధునిక క్రీడలతో పాటు గ్రామీణ క్రీడలు వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలను నిర్వహిం చడం జరుగుతుందని, దీనిలో భాగంగా జిల్లాలో రెండు పర్యాయాలు రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ క్రీడలు, మొన్న వేములవాడ లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ లను నిర్వహించామన్నారు. క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుందని, జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా ఎదు ర్కొంటారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రీడలను, ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని అన్నారు. క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలను ఆతిథ్యం ఇస్తున్న రంగినేని సుజాత మోహన్‌ రావు ట్రస్టు చైర్మన్‌ మోహన్‌ రావను అభినందించారు. అనం తరం క్రికెట్‌ క్రీడా మైదానంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ బ్యాటింగ్‌ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, జిల్లా కార్యదర్శి చొక్కాల రాము, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మున్సిపల్‌ కాంగ్రెస్‌ ప్లోర్‌లీడర్‌ ఆడెపు చంద్రకళ ప్రభాకర్‌, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్‌, లింగం పల్లి గంగరాజు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, రంగినేని సుజాత మోహన్‌రావు ట్రస్టు చైర్మన్‌ మోహన్‌రావు, ఎస్‌జీఎఫ్‌ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పది జిల్లాలో క్రీడాకా రులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:40 AM